by Suryaa Desk | Tue, Jan 07, 2025, 04:12 PM
ఎంఎల్సి పట్టభద్రుల అభ్యర్థి ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మానకొండూర్ మండల అధ్యక్షుడు ముక్కెర సతీష్ కుమార్ కోరారు.సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సమావేశానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లం లింగమూర్తి పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..గత 40 సంవత్సరాలుగా విద్యాసంస్థలలో ఆంధ్ర విద్యాసంస్థలకు దీటుగా ఉత్తర తెలంగాణలో విద్యాసంస్థలు స్థాపించి,అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత నరేందర్ రెడ్డిది అన్నారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు గ్రంథాలయాలలో విద్యార్థులు చదువుకునేందుకు మౌలిక వసతులు కల్పించారని గుర్తు చేశారు.వివిధ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటుచేసి,ఉచిత మెటీరియల్ ఇచ్చి విద్యార్థులకు అండగా నిలిచారన్నారు.సమావేశంలో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెంట అజయ్ పటేల్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ కాల్వ మధుబాబు,గట్టు తిరుపతి,కనక రాజేశం,బొడ్డు అయిలయ్య,నడిగొట్టు శంకర్,విక్రమ్ ఉన్నారు.