by Suryaa Desk | Wed, Jan 08, 2025, 04:07 PM
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశం లో పాఠశాలల్లో ఆంగ్లాన్ని సులభతరంగా విద్యా బోధన చేయడంపై మండల విద్యాధికారులు, ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు సులభతరంగా అర్థమయ్యేలా విద్యా బోధన చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు ఉంటారు కాబట్టి ఆంగ్ల భాషకు ప్రాధాన్యత కల్పిస్తూ విద్యాబోధన చేయాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో ప్రోజెక్టర్ల ద్వారా ఇంగ్లీష్ సినిమాలు చూయించడం వల్ల కూడా ఆంగ్లంలో ప్రావీణ్యత సాధించవచ్చునని కలెక్టర్ తెలిపారు.
ఇంగ్లీష్ భోధన చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ మాసం లోపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థిని, విద్యార్థులకు ఇంగ్లీషులో నైపుణ్యాన్ని పెంపొందించాలని కలెక్టర్ తెలిపారు. పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, డిఇఓ రేణుకా దేవి, వయోజన విద్య అధికారి శ్రీనివాస్ గౌడ్, మైనార్టీ బాలికల గురుకుల కళాశాల ప్రిన్సిపల్ మహబూబా ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.