by Suryaa Desk | Tue, Jan 07, 2025, 04:09 PM
బీ ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ గారి పిలుపు మేరకు మరియు వికారాబాద్ జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారి ఆదేశాల మేరకు సోమవారం వికారాబాద్ లోని మాజీ ఎమ్మెల్యే నివాసం నుండి బయలుదేరిన బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు జిల్లా కేంద్రం లోని ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి రోడ్ పై బైటయించి ప్లకార్థులతో నినాదాలతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మాటలు మారుస్తూ, అబద్ధాలు చెప్తు కాలయాపన చేసి రైతులకి ఇవ్వవలసిన రైతు భరోసా చెప్పిన విధంగా 15,000/- కాకుండా తక్కువ ఇస్తామనడం దుర్మార్గం అని, ఇది ముమ్మాటికీ రాష్ట్ర రైతుంగాన్ని మోసం చెయ్యటమే అన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికి 15 వేలు రైతు భరోసా అందించాలని బీ ఆర్ ఎస్ పార్టీ తరపున రైతుల పక్షాన హెచ్చరించారు లేదంటే ఈ కాంగ్రెస్ పార్టీ మరియు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని రైతులు & ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారన్నారు.
ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు ఎండీ నయీమ్, కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, రామస్వామి, గోపాల్, రాములు, పీ ఏ సీ ఎస్ వైస్ చైర్మన్ పాండు, సీనియర్ నాయకులు మేక చంద్ర శేఖర్ రెడ్డి, వికారాబాద్ మండల మాజీ సర్పంచుల సంగం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు గయాజ్, వికారాబాద్ పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షులు మూర్తుజా ఆలీ, ఉపాధ్యక్షులు ఎండీ ఫరీద్ జనరల్ సెక్రటరీ ఎండీ అఫ్జల్ పాషా (షకీల్) మాజీ కౌన్సిలర్లు లక్ష్మణ్, బీ ఆర్ శేఖర్, భరత్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, పడిగల్ల అశోక్, మహిపాల్ రెడ్డి, బి . నర్సింలు, రమణ, సురేష్ గౌడ్, మంచన్ పల్లి సురేష్, సుభాన్ రెడ్డి, అనంతయ్య, ధ్యాచారం మల్లికార్జున్, ఆర్ . మల్లేశం, ఆర్.సుభాష్, ప్రభాకర్ రెడ్డి, గాండ్ల మల్లికార్జున్, శివ కుమార్, బాబు నాయక్, సిరిపురం రమేష్, ఎన్నెపల్లి గోపి, మహిపాల్, శివారెడ్డి పేట్ దత్తు, షఫీ, మల్లేష్, శ్రీనివాస్ గౌడ్, ఎన్కేపల్లె ప్రవీణ్ కుమార్, భరత్ ఇస్మాయిల్, కాషాయ్య, సత్యనారాయణ సోను రాథోడ్, ఎన్నెపల్లి వరున్ సోషల్ మీడియా అధ్యక్షులు మల్లేష్, వికారాబాద్ మండల యువజన విభాగం అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, పట్టణ యువజన విభాగం ఉపాధ్యక్షులు గంగారాం తేజ, వెంకటాపూర్ తండా యువజన విభాగం అధ్యక్షులు శీను తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గంలోని మండలాలలో బీ ఆర్ ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రైతుల పక్షాన వినూత్న నిరసనలు చేపట్టారు.