by Suryaa Desk | Sun, Jan 05, 2025, 02:42 PM
నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వం లక్ష్యం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టిందని ఎంపీఓ శోభ అన్నారు. శనివారం కోహెడ మండలం సముద్రాల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను ఇంటింటికి తిరుగుతూ తనిఖీ చేశారు.
మండలములో వివిధ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు పక్క ఇళ్లు నిర్మించాలనే ఉద్దేశముతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తెచ్చింది అన్నారు.
మొదటి విడతలో సొంత స్థలం కలిగి ఉండి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణానికి నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితులలో దళారులను ఆశ్రయించవద్దని, పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.అతి తక్కువ ఖర్చుతో సొంతింటి కలను సహకారం చేసుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో సముద్రాల గ్రామ కార్యదర్శి తిరుపతి. కారోబార్ సంపత్, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.