by Suryaa Desk | Sat, Jan 04, 2025, 04:30 PM
మేడిపల్లి మండలం పోరుమల్ల గ్రామానికి చెందిన మాదం మహేష్ యాదవ్ (43 సం) తండ్రి చిన్న మల్లయ్య, సంవత్సరం క్రితం మాదం మహేష్ యాదవ్ భార్య అతని పై వరకట్న వేధింపులు, గృహహింస, మెంటెనెన్స్ కేసు పెట్టి ఆమె తల్లి ఇంటికి వెళ్లి పోయినది. అప్పటినుండి అతని కుమారుడు (14 సం), కుమార్తె (12 సం) మహేష్ యాదవ్ సంరక్షణలో ఉంటున్నారు. తేది 01-06-2024 రోజున తన భార్య, కుల సంఘం పెద్దమనుషులు తనను ఉదయం 9 గంటలకు కుల సంఘానికి పిలిచి తమ భార్య, భర్తల విషయం మాట్లాడడానికి, కుల సంఘానికి 50,000/- రూపాయలు డిపాజిట్ పెట్టి సమస్యను పరిష్కరించుకోవాలని తనపై ఒత్తిడి చేశారని, అతను కోర్టులో న్యాయ పరిష్కారానికి ఒప్పుకుంటాను తప్ప, తను సంఘములో డబ్బులు డిపాజిట్ పెట్టనని చెప్పిన, తన మాట వినకుండా డిపాజిట్ పెట్టాలని డిమాండ్ చేశారని, కుల సంఘ పెద్దమనుషులలో ఒకరు తన కాలర్ పట్టుకుని చేతితో కొట్టారని, సంఘం పెద్దమనుషుల మాట వినడం లేదని, సంఘంలో పెద్ద మనుషులు తన సభ్యత్వ నమోదును తీసేసి, తనను కుల సంఘం నుండి బహిష్కరించినట్లు తెలిపారు.
గత ఐదు నెలల నుండి ఈరోజు వరకు కుల సంఘములో చాలా పండగలు జరిగిన తనను రానివ్వలేదని, ప్రతి నెల సంఘ సమావేశానికి రానివ్వలేదని, సంఘం హాజరుకు పిలవడం లేదని, తేది 16-12-2024 ప్రజా వాణి లో అర్జీ పెట్టుకోగా మండల రెవిన్యూ అధికారులను విచారణ జరపాలని కలెక్టర్ ఆదేశించారని, మండల రెవెన్యూ అధికారులు తొందరగా విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని ఈ ఘటనల వల్ల తను మానసికంగా, శారీరకంగా మనస్తాపం చెందుతున్నట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు.