by Suryaa Desk | Sun, Jan 05, 2025, 01:11 PM
ముస్తాబాద్ మండలం పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ తలారి రాణి నర్సింలు అధ్యక్షతన పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కార్యదర్శి హరినాథ్ మార్కెట్ కమిటీ సభలో ప్రవేశపెట్టగా పాలకవర్గ సభ్యుల ముందు చదివి వినిపించి చర్చించి పలు తీర్మానాలు చేశారు. సందర్భంగా చైర్మన్ తలారి రాణి మాట్లాడుతూ రైతుల కొరకు కార్యాలయంకు మార్కెట్ యార్డ్ లో సిసి . డ్రైనేజ్. కాంపౌండ్ వాల్. కవర్ బెడ్ రూమ్. స్వాగతతోరణం. ఎడ్లబండితో కూడిన రైతు విగ్రహం త్రాగునీటి కోసం బోర్ లైన్ వంటి అభివృద్ధి పనులకు తీర్మానాలు చేశామని కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ ఆది శ్రీనివాస్ కేకే మహేందర్ రెడ్డి సహకారాలతో మార్కెట్ కమిటీని అభివృద్ధి చేసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెలుముల రాంరెడ్డి. కార్యదర్శి హరినాథ్. సింగిల్ వండర్ చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి. డైరెక్టర్ లు. కదిరె సత్య గౌడ్ బొప్ప శంకర్. రాగం కొమురయ్య. బద్దిపడిగే ప్రతాపరెడ్డి. క్యారం రాజు. సుద్దాల రాజయ్య. నల్ల బుచ్చయ్య. సరగుండా రామ్ రెడ్డి. కుంభాల యాదగిరిరెడ్డి. అన్నమనేని సుధాకర్ రావు. మామిళ్ళ శ్రీకాంత్.లావకత్ మున్న.. సిబ్బంది నర్సింలు. నిశాంత్. తదితరులు పాల్గొన్నారు.