by Suryaa Desk | Mon, Jan 06, 2025, 12:16 PM
యూఎస్ ఎకనమిక్ డేటా మీద ఇన్వెస్టర్లు ఫోకస్ పెట్టడంతో గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేటు స్థిరంగా ఉంది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 2,647 డాలర్ల వద్ద ఉంది.ఈ రోజు, మన దేశంలోనూ బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు దాదాపు రూ.80 వేల రేటు నడుస్తోంది. వెండి ధరలోనూ నేడు ఎలాంటి మార్పు లేదు.
తెలంగాణలో బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,710 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,150 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 59,030 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ. 99,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్లో బంగారం, వెండి ధరలు
విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,710 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 72,150 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 59,030 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 99,000 గా ఉంది. విశాఖపట్నం మార్కెట్లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.