by Suryaa Desk | Sun, Jan 05, 2025, 02:52 PM
ప్రజా ఉద్యమాల నిత్యం గొంతుక భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల సంబరాల సందర్భంగా గాయని శ్యామల స్వీయ రచన గానంతో రూపొందించిన వందేళ్ళ ఎర్రజెండా పాట ఆడియో వీడియోలను సిపిఐ జాతీయ పూర్వ కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి సిపిఐ జాతీయ నాయకులు సిఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి తో కలిసి శనివారం సి ఆర్ ఫౌండేషన్ కళాక్షేత్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ:- మహబూబ్ నగర్ కు చెందిన సింగర్ శ్యామల స్వీయ రచనతో గానంతో వందల పాటలను గైకట్టి ఆమె పాటకు సామాజిక రాజకీయ అంశాలను జోడిస్తూ మార్క్సిజం నూరిపోస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తుందని శ్యామల పాటలు ఊట సెలిమె లాంటివని అన్నారు. పాట ప్రజా ఉద్యమాలకు ఊపిరి నిస్తుందని బ్రిటిష్ ముష్కర పాలన నుండి నేటి తెలంగాణ ఉద్యమం వరకు పాటే ఉద్యమాలకు ప్రాణం పోసిందని అన్నారు. పాట ఎల్లప్పుడూ జనం పక్షాన ప్రజా సమస్యలను ఎత్తిచూపుతో కొత్త వరవడిలో పరుగులు పెట్టించాలని అన్నారు.
శ్యామల పార్టీ వందేళ్ళ ఆవిర్భావం వేడుకల జయప్రదం కోసం అనేకవేయ ప్రయాసల కోర్చి పాటను రూపొందించడం అభినందనీయమని అన్నారు. శ్యామలకు పాట రాయడం ఆమెనే పాడడం గొప్ప అంశమని అన్నారు.ఆమె చేతి ఆమె గొంతు ద్వారా మరిన్ని విప్లవ గేయాలు సాంస్కృతిక కార్యక్రమాలు వెలువడాలని అభిలాషించారు. పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని అన్నారు. పల్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ:- శ్యామల పార్టీ పట్ల నిబద్ధత కలిగి ఎల్లప్పుడు తనదైన శైలిలో పార్టీ గేయాలు అమరవీరుల స్మృతి గీతాలు, సామాజిక చైతన్య పాటలు అందిస్తుందని అన్నారు. శ్యామల ఎంఫిల్ లో గోల్డ్ మెడలిస్టుగా రాణించిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటిసి జాతీయ నేత సురవరం విజయలక్ష్మి సిఆర్ ఫౌండేషన్ కోశాధికారి చెన్నకేశవ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహ సిపిఐ వనపర్తి జిల్లా కార్యదర్శి కె విజయరాములు మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి బి.బాలకిషన్, కందాల రామకృష్ణ ,తెలంగాణ ఉద్యమకారుడు ఆర్ ఎన్. శంకర్ శేర్లింగంపల్లి సిపిఐ నేతలు రామకృష్ణ చందు యాదవ్ సుధాకర్ శివ నారాయణ కొండల్ గో కళాకారులు గోపి సుధాకర్ సురేష్ పద్మావతి రామచందర్ నాగేశ్వరి స్రవంతి లయ తదితరులు పాల్గొన్నారు.