by Suryaa Desk | Mon, Jan 06, 2025, 02:25 PM
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైన ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాలు విక్రయించిన వినియోగిమచిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో యువతి, యువకులు గాలిపటాలను ఎగరవేయడానికి సిద్దమవుతున వేళ గాలి పటాల విక్రయదారులు చైనా మాంజాను విక్రయించడం జరుగుతొంది. నైలాల్, నింథటిక్ దారాలతో తయారు చేసే ఈ చైనా మాంజాలతో మనుషులతో పాటు ఎగిరే పక్షులకు ప్రమాదకరం కావడంతో పాటు పర్యవరణానికి విపత్తుగా కావడంతో జాతీయ హరిత ట్రిబ్యూనల్ ఆదేశాలను మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది.
ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసుల అధ్వర్యంలో నిర్వహించిన తనీఖీల్లో సూమారు 2లక్షల 62వేల రూపాయల విలువైన చైనా మాంజాను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే కమిషనరేట్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో చైనా మాంజా విక్రయాలు జరగకుండా తగు చర్యలు తీసుకొవడం జరుగుతొందని. ప్రధానం ప్రజలు సైతం చైనా మాంజా వినియోగం పట్ల దూరంగా వుంటూ ఎవరికి హాని కలగని సాధారణ దారంలో గాలిపటాలను ఎగురవేసుకోవాలని. అలాగే ఏవరైన చైనా మాంజా విక్రయిస్తున్న, వినియోగిస్తున్న డయల్ 100నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.