by Suryaa Desk | Sun, Jan 05, 2025, 02:07 PM
ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన గొట్టే సుమలత పుట్టుకతోనే దివ్యాంగురాలు. చదువుకోవడానికి తన అంగవైకల్యం అడ్డు రాలేదు.ఉన్నత చదువులు చదివింది కానీ ఉపాది లేకుండా ఉండి పోయుంది.తల్లిదండ్రులు ఇద్దరూ వృద్దులు కావడంతో పనిచేయని స్థితిలో ఉండడంతో తనకొచ్చె పెన్షన్ డబ్బుతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తుంది.ఏదైనా ఉపాధి చూపాలని గత ప్రభుత్వ పెద్దలను ఎన్నోసార్లు కలిసినా పట్టించుకోలేదని సుమలత ఆవేదన వ్యక్తం చేసింది.
తనకు ఏదైన ఉపాధి చూపాలని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డిను కలిసి అడిగింది.వెంటనే స్పందించిన కేకే మహేందర్ రెడ్డి కలెక్టర్ సందీప్ కుమార్ ఝ కు విషయం తెలియజేశాడు.వెంటనే స్పందించిన కలెక్టర్.. సిస్టం ఆపరేటర్ గా ఉద్యోగం కల్పించాడు.తనకు అండగా ఉండి ఉద్యోగ భరోసా కల్పించిన కేకే మహేందర్ కి ,ఏళ్ళ బాల్ రెడ్డి గారికి ,గజ్జల రాజు, గుండెల్లి శ్రీనివాస్, ఉచిడి బాల్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు సుమలత వారి కుటుంబ సభ్యులు.