by Suryaa Desk | Sat, Jan 04, 2025, 02:40 PM
ఐఐటి చదువులకై గతంలో హైదరాబాద్ విజయవాడ ప్రాంతాలకు తరలి వెళ్లే వారిని అక్కడ ఆర్థికంగా ఇబ్బందులు పడి అనేకమంది చదువు మధ్యలో వదిలేసుకోవాల్సి వచ్చిందని, ఈ తరుణంలో కోదాడ పట్టణంలో కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు రేస్ కళాశాలను స్థాపించడం నిజంగా అభినందనీయమని ప్రభుత్వ న్యాయవాది కొమరబండ గ్రామవాసి సుధాకర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్వగృహంలో రేస్ కళాశాల బ్రోచర్ ను ఆయన విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను తక్కువ ఫీజుకు అందించడం నిజంగా అభినందించాల్సిన విషయం అన్నారు.
గతంతో పోలిస్తే చాలా వరకు దూర ప్రాంతాలకు వెళ్లకుండా కోదాడలోని రేస్ కళాశాల చదివిందుకు సిద్ధమవుతున్నారన్నారు. జాతీయస్థాయిలో ర్యాంకుల సాధిస్తున్న రేస్ కళాశాల భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో త్రివేణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సిరికొండ శ్రీనివాస్, వాగ్దేవి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మట్టపల్లి మధు ఉన్నారు