by Suryaa Desk | Sun, Jan 05, 2025, 01:02 PM
విద్యార్థుల్లోని విద్యా నైపుణ్యాల పరిశీలన శనివారం తిప్పర్తి మోడల్ స్కూల్ నందు పానెల్ ఇన్స్పెక్షన్ నిర్వహించి విద్యార్థుల యొక్క విద్య నైపుణ్యాలను పరిశీలించారు ఉపాధ్యాయులు విద్యను బోధించే విధానం , విద్యార్థుల మార్కుల రికార్డులను ,పరీక్ష పేపర్లను , పరిశీలించారు మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులచే రాగిజావ, వారానికి ఎన్ని గుడ్లు పెడుతున్నారు.
మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుందని వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో గుర్రంపూడ్ ప్రిన్సిపాల్ రాగిణి, నాంపల్లి ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి, మర్రిగూడెం ప్రిన్సిపాల్. స్వరూప రాణి , కనగల్ ప్రిన్సిపాల్ థామస్, పీఏ పల్లి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు