by Suryaa Desk | Mon, Jan 06, 2025, 03:16 PM
రైతులకి బాకీ ఉన్న రైతు భరోసా ఎప్పుడిస్తావ్ అంటూ ఆదివారం వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పేట్ మండలంలో వికారాబాద్ జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారి అధ్యక్షతన బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, రైతులు బోర్డులు, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. రైతు భరోసా బకాయిలు మొత్తం ఇవ్వకపోతే కాంగ్రెస్ నాయకులు ఊర్లల్లో తిరిగే పరిస్థితులు కూడా లేదని ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నర్సింహా రెడ్డి మోమిన్ పేట్ మండల బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకట్, కౌన్సిలర్ గోపాల్ పీ ఏ సీ ఎస్ చైర్మన్లు విష్ణు వర్ధన్ రెడ్డి, రామ చంద్ర రెడ్డి, సీనియర్ నాయకులు మేక చంద్ర శేఖర్ రెడ్డి, శ్రీరాములు మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ మండల యువజన విభాగం అధ్యక్షులు తిరుపతిరెడ్డి మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు మహబూబ్ ఆలీ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పడిగళ్ల అశోక్ సోషల్ మీడియా అధ్యక్షులు మల్లేష్, అనిల్ మోమిన్ పేట్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.