by Suryaa Desk | Mon, Jan 06, 2025, 03:36 PM
రాష్ట్రంలో అధికారం లోకి రావడానికి అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను నట్టేట ముంచిందని బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం ఇష్టారీతిన దొంగ హామీలిచ్చి నిరుద్యోగులకు, రైతులకు, మహిళలకు, వృద్ధులకు, వికలాంగులను సహా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని చెప్పారు.
బిజెపి సీనియర్ నాయకులు అమరగాని ప్రదీప్ కుమార్, మెండే రాజయ్య, కొమ్మ ఐలయ్య, కళ్లెం దామోదర్ రెడ్డి, పెద్దోళ్ల ఐలయ్య, మెరుగు కనకయ్య, బుసారపు రవీందర్ గౌడ్, ఆవుల రాజు, కంచి శ్రీనివాస్, గడ్డం మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.