by Suryaa Desk | Tue, Jan 07, 2025, 04:28 PM
మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో ప్రతిభను కనబరిచి గ్రాండ్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకున్నారు. సోమవారం ఆత్మకూరు మండలం పెద్దాపూర్ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు పరకాల పట్టణంలోని మయూరి గార్డెన్ లో నిర్వహించిన నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని గ్రాండ్ ఛాంపియన్షిప్ తో పాటు అత్యధిక బహుమతులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, సినీ ప్రముఖులు బండారి జగదీష్ చేతుల మీదుగా అందుకున్నారు. అత్యధిక బహుమతులతో పాటు గ్రాండ్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకున్న విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ దామెర అనిత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.
అలాగే కరాటే మాస్టర్ సుమన్ అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ దామెర అనిత మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడంతో పాటు బహుమతులను తెలుసుకోవడం అభినందనీయమన్నారు. అలాగే చదువుల్లో కూడా పట్టుదలతో రాణించి ర్యాంకులు సాధించాలని విద్యార్థులకు సూచించారు. క్రీడల పై ప్రతిభ చూచే విద్యార్థులు మానసిక ఉల్లాసంతో చదువులో రాణిస్తారు అన్నారు. క్రీడలతోపాటు చదువులో రాణించే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ప్రిన్సిపాల్ దామెర అనిత అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వి అనిత, ఉపాధ్యాయులతో పాటు కరాటే మాస్టర్ సుమన్ పాల్గొన్నారు.