by Suryaa Desk | Wed, Jan 08, 2025, 03:33 PM
నర్సంపేట పట్టణంలోని సిపిఐ (ఎం-ఎల్) పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ (ఎం-ఎల్) రాష్ట్ర నాయకులు కామ్రేడ్ మోడెం మల్లేశం మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలోని ఐఎంఏ డాక్టర్లు గత రెండు రోజుల క్రితం సమావేశమై ఓ పి సేవలకు 300 రూపాయల నుండి 400కు రూపాయలకు మత్తు డాక్టర్ల ఫీజు 2000 రూపాయల నుండి 2500 రూపాయలకు పెంచాలని నిర్ణయం చేయడం జరిగినది. ఇది నర్సంపేట ప్రాంత ప్రజలపై మూలిగే నక్కపై తాటిపండు పడిన విధంగా ఉన్నది. ఇప్పటికే నర్సంపేట పట్టణంలోని డాక్టర్లు హాస్పిటల్ యాజమాన్యాలు ఆర్ఎంపీ డాక్టర్లతో రహస్య ఒప్పందాలు చేసుకొని వైద్యం కోసం వచ్చిన పేషంట్ల నుండి ఓ పి ఫీజు కింద 300 రూపాయలు టెస్టుల పేరుతో ఒక పేషెంట్ నుండి 1500 నుండి 2000 రూపాయలు ఒకవేల పేషంటును గనుక హాస్పిటల్ లో అడ్మిట్ చేసుకుంటే ఒక రోజుకు బెడ్ చార్జ్ కింద 3000 నుండి 5000 రూపాయలు డాక్టర్ ఫీజు నర్స్ ఫీజు మెయింటెనెన్స్ ఫీజు ఇలా అనేక రకాలుగా చార్జీలు వేసి రోగి నుండి ఒక రోజుకు వేళల్లో గుంజు వేయడం జరుగుతున్నది. దానికి తోడు తమకు నచ్చిన మెడికల్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని, తమ ఇష్టానుసారమైన ఎమ్మార్పీ రేట్లను మందులపై ముద్రించుకొని, సుమారుగా ఒక పేషెంట్ నుండి మందులపైన మూడు వేల నుండి 5వేల ఐదువేల రూపాయల వరకు లాగటం జరుగుతున్నది. అలాగే చిన్న ఆపరేషన్ నుండి మొదలుకొని డెలివరీ గర్భసంచి ఆపరేషన్లకు 30 నుండి 50, 60 వేల వరకు రూపాయలు పేషెంట్ నుంచి లాగేసుకోవడం జరుగుచున్నది. నర్సంపేట పట్టణంలోని హాస్పిటల్స్లలోఎలాంటి కనీస సౌకర్యములు లేకుండానే కార్పోరేట్ స్థాయిలో ఫీజులను లాగి వేస్తూ ఉన్నప్పటికీ దీనిని అరికట్టాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించటం జరుగుచున్నది. నర్సంపేట పట్టణంలో ప్రభుత్వం నుండి తీసుకున్న పర్మిషన్ కు విరుద్ధంగా తమ నర్సింగ్ హోమ్ లను నడుపుతూ రోగుల నుండి లక్షల రూపాయల్ని సొమ్ము చేసుకోవడం జరుగుచున్నది.
మరోవైపున ఇప్పటికే నర్సంపేట పట్టణంలోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లలో హాస్పిటల్లో తీసుకుంటున్న ఫీజులు ఆకాశాన్ని అంటి ఉన్నప్పటికీ, మరోవైపున మళ్లీ ఓ పి తదితర చార్జీలను పెంచి పేషంట్ల నుండి ఇష్టానుసారంగా దోపిడి చేయుటకు నర్సంపేట ఐఎంఏ డాక్టర్లు సిద్ధపడుతున్నారు. కావున నర్సంపేట ఐఎంఏ డాక్టర్లు ఇప్పటికైనను పునరాలోచన చేసి ఓపి మత్తు డాక్టర్ల మరియు తదితర సేవల కోసం పెంచే ఫీజులను విరమించుకోవాలని కోరుతున్నాము.
అలాగే సంబంధిత అధికారులు నర్సంపేటలోని నర్సింగ్ హోమ్ లలో తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న హాస్పిటల్స్ పైన, డాక్టర్ల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ సమావేశంలో తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఈర్ల పైడి, జిల్లా నాయకులు కామ్రేడ్ భూమా అశోక్, కామ్రేడ్ రామచందర్, కామ్రేడ్ బర్ల గౌరయ్య పాల్గొన్నారు.