by Suryaa Desk | Wed, Jan 08, 2025, 04:09 PM
మల్యాల మండలంలోని పలు గ్రామాలకు చెందిన కుటుంబాలను చొప్పదండి శాసన సభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం పరామర్శించారు. తక్కళ్లపెల్లి గ్రామానికి చెందిన దొనకొండ చెంద్రయ్య మృతి చెందగా వారి కుటుంబన్ని పరామర్శించి 5000 ఆర్థికసాయం చేసి, తాటిపల్లి గ్రామానికి చెందిన సుంకపాక హన్మయ్య మృతి చెందగా వారి కుటుంబన్ని పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేసి ,రామన్నపేట పేట గ్రామానికి చెందిన క్యాతం మల్లేశం ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు దొంగ ఆనందరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లేశ్వరిశ్రీనివాస్ గౌడ్ , దారం ఆదిరెడ్డి ,వెలమ లక్ష్మారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శనిగరపు తిరుపతి, సింగిల్ విండో చైర్మన్ చంద్రశేఖర్, కంచర్ల లక్ష్మణ చారి, మ్యాక లక్ష్మణ్, వంశి, నరసింహారెడ్డి, నాగులపేట సంజీవ్ ,అనిల్ ,నక్క అనిల్, దూడం రామాంజనేయులు, స్వామి రెడ్డి, రంగ తిరుపతి, ప్రశాంత్,తదితరులు పాల్గొన్నారు.