by Suryaa Desk | Wed, Jan 08, 2025, 03:54 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో బాబు చనిపోవడం దురదృష్టకరమైన సంఘటనని భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా జాగ్రత్త పడతామని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సి రామచంద్రయ్య తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల సర్వీసు అందిస్తూ సంబంధిత నిపుణులచే మెరుగైన వైద్యం అందిస్తున్నామని చిన్న పిల్లలకు, సాధారణ జబ్బులకు, ప్రసూతి సేవలు అందిస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందిస్తున్నామని తెలిపారు. కొన్ని సంఘటనలు జరగడం వలన ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాటిని దృష్టిలో పెట్టుకొని నిరంతరం పర్యవేక్షిస్తూ సిబ్బందికి డాక్టర్లకు నిరంతరం సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వ ఆసుపత్రి సేవలు ముందుకు తీసుకెళ్తామని వైద్య పరీక్షలు ఎమర్జెన్సీ సంబంధించిన పరీక్షలు చేస్తున్నామని బ్లడ్ బ్యాంక్ అందుబాటులో ఉన్నదని అత్యవసర సమయంలో రక్తం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.
డాక్టర్ అంటే ప్రాణాలు పోసే వ్యక్తిగా పనిచేస్తున్నామని ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలు మరింత ఉపయోగించుకోవాలని ఎలాంటి ఇబ్బంది ఉన్న తనకు తెలియజేయాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెండెట్ తెలిపారు. వికారాబాద్ ప్రాంత వాసుడైన నాకు వికారాబాద్ కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్ష ప్రజలకు సేవ చేస్తే ఎంతో సంతృప్తి ఉంటుందని డబ్బు లేని వారే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు అనే కోణంతో వచ్చే ప్రతి రోగి నీ జాగ్రత్తగా చూసి తగిన చికిత్స అందించే విధంగా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. 56 మంది డాక్టర్లు, 164 మంది నర్సింగ్ ఆఫీసర్స్ తో హాస్పిటల్ నిర్వహిస్తున్నామని 24 గంటలు డ్యూటీ డాక్టర్లు పర్యవేక్షించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం జరిగిన సంఘటనపై విచారణ కమిటీ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.