by Suryaa Desk | Wed, Jan 08, 2025, 03:31 PM
దుబ్బాక నియోజకవర్గం లోని పిల్ల కాలువల గురించి పది సంవత్సరాలు అధికారంలో ఉండి చేయలేని కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదం. అక్బర్ పేట భూంపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్ మాట్లాడుతూ నిన్న బి ఆర్ ఎస్ పార్టీ ధర్నా చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుండేదని తెలిపారు. రైతులకు గౌరవ ముఖ్యమంత్రి రైతు భరోసా కింద ఎకరానికి 12,000 ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అని తెలిపారు. అలాగే భూమిలేని ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఇవ్వడం హర్షించేదగ్గ విషయమని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ చేసిన ఆర్థిక విధ్వంసం ద్వారానే ఈరోజు రైతులకు 15000 కాకుండా 12000 రూపాయలు ఇస్తున్నామని రాబోయే రోజుల్లో సంపదను సృష్టించి పేదలకు పంచడానికి ఈ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపారని తెలియజేశారు. దుబ్బాక నియోజకవర్గంలోని రైతుల భాగస్వామ్యంతో మల్లన్న సాగర్ ను నిర్మిస్తే ఇక్కడి ప్రాంత రైతులకు నీళ్లు ఇవ్వడానికి గత ప్రభుత్వం కాలువలు తీయలేని అసమర్థులని అలాగే పక్కనున్న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు ప్రధాన కాలువల ద్వారా నీళ్లు తీసుకుపోయి అక్కడ పిల్ల కాలువలను కూడా పూర్తిచేసి నీరు అందించిన చరిత్ర మరిచిపోయిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ రోజు దుబ్బాక పిల్ల కాలువలు గుర్తుకు రావడం హాస్యాస్పదమని తెలిపారు. రైతులు ఎవరు బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏక కాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిందని తెలిపారు. గతంలో ఇక్కడ ప్రాంత రైతులకు పదివేల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని స్వయంగా అప్పటి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు, ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పి ఇవ్వలేరని రైతులను మోసం చేసిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీది అని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దుబ్బాక రైతాంగానికి, ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా పాతూరి వెంకటస్వామి గౌడ్, ఏలూరి కమలాకర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కోనపురం బాలు యాదవ్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి బ్యాగరి నవీన్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పుద్దుజి ప్రభాకర్ చారి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లన్న గారి సురేందర్ రెడ్డి, కడవెరుగు నాగరాజు, ఉప్పరి యాదగిర, మధుగని వెంకట్ యాదవ్, బోయిని పరశురాములు, ధ్యావర మైపాల్ యాదవ్, గొరిమిండ్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.