by Suryaa Desk | Sun, Jan 05, 2025, 03:01 PM
SCERT & ELTA (ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఇంగ్లీష్ ఒలంపియాడ్ & ఎలాక్యూషన్ పోటీలు జరుగుతున్నాయి.దీనిలో భాగంగా గొల్లపల్లి మండలం మోడల్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు మండల స్థాయిలో అత్యంత ప్రతిభ కనబరిచి,జిల్లా స్థాయికి సెలెక్ట్ అయ్యారు.ఒలంపియాడ్ విభాగంలో పి. కావ్య,జే. విశ్వక్ సేన,ఎలక్యూషన్ విభాగంలో,బి.ఆశిష్,ఎండి జోహార జిల్లా స్థాయికి సెలెక్ట్ అయ్యారు.
నిన్న జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారిని జమున దేవి గారు అటెండ్ అయ్యి,ఇంగ్లీష్ ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు వివరించి జిల్లా స్థాయికి సెలెక్ట్ అయిన విద్యార్థులను అభినందించారు.మోడల్ స్కూల్ కు నూతనంగా వచ్చిన ప్రిన్సిపాల్ సుంకరి రవి ప్రత్యేక చొరవ చూపి విద్యార్థులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.దీనివల్ల విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందుతూ చదువులో ఆటపాటల్లో జిల్లా రాష్ట్రస్థాయికి వెళుతున్నారు.జిల్లా స్థాయికి సెలెక్ట్ అయిన విద్యార్థులను ప్రిన్సిపాల్ సుంకరి రవి అభినందించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ తిరుపతి,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.