by Suryaa Desk | Mon, Jan 06, 2025, 02:06 PM
రాష్ట్రస్థాయి ఇంటర్ డోజో కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో దుబ్బాక పట్టణ విద్యార్థులు 14 బంగారు పథకాలు సాధించారని యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు , అండ్ స్టైల్ చీఫ్ మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపారు. రెంజుకి షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఇండియా వారి ఆధ్వర్యంలో ఆదివారం మెదక్ జీ కే ఆర్ గార్డెన్ లో రాష్ట్ర సాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సుమారు 1500 మంది విద్యార్థులు పాల్గొనగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణం లచ్చ పేట మోడల్ స్కూల్ ఐశ్వర్య, వర్షిని, విహాన్.
జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లక్షిత, అర్చన . ఎంపీపీ ఎస్ స్కూల్ చరణ్, భవ్య శ్రీ, అక్షిత, అక్షయ . సరస్వతి గ్లోబల్ స్కూల్ రిషిక్, భరద్వాజ్. గాయత్రి వివేకానంద విద్యాలయం మనశ్విన్ మాస్టర్ మైండ్ స్కూల్ హర్షవర్ధన్. ఋషి విద్యాలయం శ్రేయన్ష్ బంగారు పథకాలు సాధించారు. బంగారం పతకాలు సాధించిన విద్యార్థులను అలానే కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ నీ రెంజుకీ షోటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు మాస్టర్ నగేష్, ప్రతాప్ సింగ్, అశోక్, నవీన్ కుమార్, హరి అభినందించారు.