by Suryaa Desk | Tue, Jan 07, 2025, 04:30 PM
మెట్ పల్లి మండలం ఆత్మకూర్ వాగు ను ప్రభుత్వం ఇసుక రీచ్ గా గుర్తించడం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామ వాగును ఇసుక రీచ్ నుండి తొలగించాలని సోమవారం గ్రామస్తులు ఆర్డివో, తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రం అందజేశారు. వాగు నుండి ఇసుక తరలించడం ద్వారా భూగర్భ జలాలు అడగంటూతున్నాయని విన్నవించారు.
తమ గ్రామానికి ఇరువైపుల తాగునీటి కై ఎలాంటి కాకతీయ, వరద కాలువలు లేవని పేర్కొన్నారు. రానున్న వేసవి కావున ఇసుక తీయడం వల్ల నీటి సమస్య తీవ్రమవుతుందని ఆరోపించారు. ప్రభుత్వం తమ సమస్యను గుర్తించి ఇసుక రీచ్ ను రద్దు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమీటి అధ్యక్షులు బండ శ్రీనివాస్ యాదవ్, వైస్ చైర్మన్ గడ్డం చంద్ర శేఖర్ రెడ్డి మరియు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.