by Suryaa Desk | Tue, Jan 07, 2025, 02:37 PM
వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యంతో నాలుగురోజుల పసికందు మృతి చెందాడంటూ ఆరోపిస్తూ వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండల్ మాదిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన బిక్షపతి బార్య స్వప్న దంపతులకు గత రెండు రోజుల క్రితం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సీజేరీన్ చేసి డెలివరీ చేయగా బాబు జన్మించాడు. బాబు ఆరోగ్యంగా ఉన్నడని తెలిపిన డాక్టర్ ఆదివారం అర్ద రాత్రి ఒంటిగంట సమయంలో బాబుకు ఎక్కిళ్లు వచ్చాయని తెలిపారు.
ఒకవేళ డాక్టర్ అప్పుడే స్పందిస్తే తమ బాబు బతుకుతుండే కానీ వస్తున్న అని కాలయాపన చేసి ఎంత సేపటికి రకపోవడంతో బాబు మృతి చెందడాని బాధితులు ఆరోపిస్తున్నారు .డాక్టర్ సమాయానికి వచ్చి ఉంటే మా బాబు బతికుండేవాడని కుటుంబీకుల ఆరోపణ డాక్టర్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయలని వారు ఆసుపత్రి ముందు బైటాయించారు.