by Suryaa Desk | Sun, Jan 05, 2025, 02:58 PM
నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ కార్యాలయంలో శనివారం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమారువిలేకరుల సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ,ఆరు గ్యారంటీ లు, 420 హామీలను వంద రోజుల్లో పూర్తి చేస్తామని, 400 రోజులు పూర్తి అవుతున్న నెరవేర్చలేదని,రైతుభరోసా... డిసెంబర్ 3 తర్వాత 7500 అని చెప్పి నేటికీ ఇవ్వలేదని, ఎన్నికల ముందే కెసిఆర్ యాసంగి రైతుబంధు ఇద్దామని ప్లాన్ చేస్తే రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని,కానీ అవే నిధులను యాసంగిలో 5 వేలే ఇచ్చి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ పార్టీ,కానీ వానకాలం భరోసా లేదు. యాసంగి భరోసా లో అనేక నిబంధనలు పెడుతున్నారు. రైతు డిక్లరేషన్ ఇవ్వాలనడం దారుణమైన విషయం అని మండిపడ్డారు.
ఆనాడు కెసిఆర్ ఏ నిబంధన లేకుండా రైతుబంధు ఇచ్చారు. కానీ నేడు రైతులు ప్రమాణ పత్రాలు ఇవ్వాలాటరైతులు దొంగలు కారు కదాఅని అన్నారు.22 వేల కోట్లు దుర్వినియోగం అంటున్నారు కదా ఆ రైతులు ఎవరో వారి జాబితాతో గ్రామ పంచాయతీల్లో పెట్టాలి తుమ్మలకు సూటి ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా ఏఈఓలు ఉన్నారు వీళ్ళ ద్వారా ఈజీగా సమాచారం తెలుసుకోవచ్చు అని అన్నారు విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి నల్లమోతు భాస్కరరావు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.