by Suryaa Desk | Sun, Jan 05, 2025, 01:03 PM
జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిప్పర్తి విద్యార్థి సాయికుమార్ రవాణా మరియు సమాచార రంగం ఉప అంశంలో రూపొందించిన స్లీప్ అలెర్ట్ అలారం ప్రదర్శన కు ద్వితీయ బహుమతి సాధించాడు. నల్లగొండ డాన్ బోస్కో స్కూల్లో జరిగిన సమావేశంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా సాయికుమార్ ఈ బహుమతి అందుకున్నాడు.ఈ ప్రదర్శన రూపొందించడానికి గైడ్ టీచర్ మోర పద్మలత సహకారం అందజేశారు.
సాయికుమార్ బహుమతి సాధించినందుకు ప్రధానోపాధ్యాయులు పానుగోతు నరసింహ నాయక్,ఉపాధ్యాయులు చిటుప్రోలు సదానందం,గంజి జ్యోతి,పెండెం సుభాషిణి, భిక్షపతి, దామోదర్రె డ్డి,హేమీమా,మెర్సీ ప్రభావతి,జ్యోతిర్మయి, శ్రీనివాస్, రామ్మూర్తి, వెంకటయ్య, జానకిరాములు తదితరులు అభినందనలు తెలిపారు.