by Suryaa Desk | Mon, Jan 06, 2025, 04:04 PM
తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఎమ్మెల్యే బాలునాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఎస్పీ నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షులు, బీఎస్పీ ఈసీ మెంబర్ , రాష్ట్ర నాయకులు, రిటైర్డ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ , బహుజన మేధావి డాక్టర్ యేకుల రాజారావు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ దేయంగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాలను మహాపురుషుల ఆశయాలను కొనసాగిస్తున్న మరియు బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధి లక్ష్యంగా ఆకాంక్షల కనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గం అదేవిధంగా నియోజకవర్గం లో ఎమ్మెల్యే బాలునాయక్ అమలు చేస్తున్న ప్రజా పాలన కు ఆకర్షితులయ్యారు.
దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి పట్టణంలో ఎమ్మెల్యే బాలునాయక్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి డాక్టర్ యేకుల రాజారావుని కాంగ్రెస్ పార్టీలో కి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి మెంబర్ పిఎసిఎస్ చైర్మన్ వేణుధర్ రెడ్డి ,నల్లగొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరజ్ ఖాన్, కొండమల్లేపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమన్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వెంకటేష్ చౌహన్, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు యేకుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.