by Suryaa Desk | Tue, Jan 07, 2025, 02:36 PM
ఫార్ములా ఈ-కార్ రేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి తన లీగల్ టీమ్ తో కేటీఆర్ చర్చిస్తున్నారు. హైకోర్టు తీర్పు కాపీ కోసం వీరు ఎదురు చూస్తున్నారు.మరోవైపు కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి ముందే తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే... తెలంగాణ ప్రభుత్వ వాదనలను కూడా వినాలని పిటిషన్ లో కోరింది.