by Suryaa Desk | Mon, Jan 06, 2025, 03:04 PM
మహిళల చిన్నారుల భద్రత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని వీరనారి ఐలమ్మ ట్రస్ట్ కన్వీనర్ మేకల వరుణ ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి తెలిపారు. ఈరోజు నల్లగొండలోని బాల భవనంలోవీరనారి ఐలమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెమినార్ జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలల హక్కుల సాధనకై బాలల రక్షణ కై పోరాడతామన్నారు. మహిళలు బాలల పౌష్టిక ఆహారం అందకపోవడం వలన దేశంలో రక్తహీనతకు గురవుతున్నారని తెలిపారు. పౌష్టికాహారం అందించుటకు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని అన్నారు.దేశంలో నానాటికి చిన్నారులపై మహిళలపై దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆడపిల్లల నిష్పత్తి రోజురోజుకు తగ్గిపోతుందని తెలిపారు. దీనివలన అనేక దుష్ప్రభావాలు సమాజం పై పడుతుందని తెలిపారు. చదువుకున్న మహిళలకు ఉపాధి కల్పించాలని తెలిపారు. నేడు మద్యం మత్తు పదార్థాల వలన యువత పెడదారి పడుతుందని తెలిపారు. మద్యం వల్లనే అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నారు.
సోషల్ మీడియా ప్రభావం విచ్చలవిడిగా వస్తున్న దృశ్యాలు సీరియల్స్ అశ్లీల సినిమాలతో అనేక ప్రభావాలు మహిళలపై పడి వారికి రక్షణ కరువైందని తెలియజేశారు వీటిని ప్రభుత్వాలే నియంత్రించాలని కోరారు. ముఖ్యంగా నేడు మహిళలకు జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు దాడులపై సమగ్రంగా చర్చలు జరగవలసిన అవసరం ఉందని తెలిపారు. తల్లితండ్రులు పిల్లల భవిష్యత్తు పైన క్రమశిక్షణ పైన మంచి మార్గం నడవడిక పైన బాధ్యత తీసుకోవాలని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని వారి బంగారు భవిష్యత్తుకు ఐలమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఐలమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యురాలు మంజుల, తదితరులు పాల్గొన్నారు.