by Suryaa Desk | Sat, Jan 04, 2025, 03:58 PM
అత్యంత పురాతనమైన శ్రీపురం శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని త్రిదండి శ్రీశ్రీశ్రీ దేవనాథ జీయర్ స్వామి శనివారం సందర్శించారు. ధనుర్మాసం సందర్భంగా వికాస తరంగిణి ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో చేపట్టిన ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా స్వామివారు శ్రీపురం శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో విశేష పూజలను నిర్వహించారు. అత్యంత పురాతనమైన శ్రీపురం శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని త్రిదండి శ్రీశ్రీశ్రీ దేవనాథ జీయర్ స్వామి శనివారం సందర్శించారు. ధనుర్మాసం సందర్భంగా వికాస తరంగిణి ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో చేపట్టిన ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా స్వామివారు శ్రీపురం శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో విశేష పూజలను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం, గోదాదేవి కల్యాణ ఉత్సవాల కరపత్రాలు స్వామివారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త రంగాచార్యులు, ప్రధాన అర్చకులు వినోదాచార్యులు, కమిటీ సభ్యులు నరసింహా రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వరదయ్య, గంధం ప్రసాద్, చంద్ర నారాయణ్, గోపినాథ్ రెడ్డి, మాధవ్ రెడ్డి, జగన్ మోహన్ రావు, యోగానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.