by Suryaa Desk | Sat, Jan 04, 2025, 03:04 PM
సావిత్రిబావి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని తిప్పర్తి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ నందు సావిత్రిబావి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ప్రిన్సిపాల్ ఏ అపర్ణ మాట్లాడుతూ సమాజంలో మహిళా విద్య పట్ల వ్యతిరేకత ఉన్న కాలంలో తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలిగా ఎదిగిన గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే జయంతి నేడు. ఈమె జయంతి 'జాతీయ మహిళా' ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపబడుతుందనీ. ఈమె గొప్ప సంఘసంస్కర్త హరిజన విద్యకు కృషి చేసిన జ్యోతిరావు పూలే యొక్క సతిమణి. భర్తనే ఆదర్శంగా తీసుకొని మహిళలకు పురుషులతో సమానంగా విద్యావకాశాలు కల్పించడానికి కృషి చేశారని పూనాలో తన భర్త స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించడంలో ఈమె కృషి ఎంతో గొప్పది.
ఈమె కృషి కేవలం స్త్రీ విద్యకే పరిమతంకాలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు సేవ చేసిన గొప్ప మహిళ. భయంకరమైన ప్లేగు వ్యాధి తో బాధపడుతున్న వారికి సేవ చేస్తూనే మరణించిందని సావిత్రిబాయి పూలే జీవితం సమాజసేవలో ప్రతీ ఒక్కరి బాధ్యతను గుర్తు చేసే ఆదర్శం తెలిపారు అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు పూలే వేషధారణతో మహిళా ఉపాధ్యాయులను ఉపాధ్యాయులు శాలువా లు పూల బొకేలతో ఘనంగా సన్మానించారుఅలరించారు కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.