by Suryaa Desk | Mon, Jan 06, 2025, 03:48 PM
శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజీలోని అయ్యప్ప సొసైటీలో 684 గజాలలో అక్రమంగా నిర్మించిన భవనానికి గతంలో జీహెచ్ఎంసీ నోటీసులు హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే ఆఉత్తర్వులను పట్టించుకోకుండా.. సెల్లార్, గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు 5 అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై ఇటీవల స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు హైడ్రా, రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారులతో కలసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం పరిశీలించారు.
అక్రమ కట్టడమని హైకోర్టు నిర్ధారించాక కూడా కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా భవనాన్ని నిర్మించడంపై జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేతకు సంబంధించి షోకాజ్ నోటీసు ఇచ్చినా పట్టించుకోకుండా భవనాన్ని నిర్మించడాన్ని హైడ్రా కమిషనర్ తీవ్రంగా పరిగణించారు. దీంతో శనివారమే సదరు భవనాన్ని కూల్చివేయాలనుకున్నారు. కానీ ట్రాఫిక్ సమస్యల కారణంగా ఆదివారం ఉదయానికి పోస్ట్ ఫోన్ చేశారు. దీంతో ఆదివారం కూల్చివేతలకి ఉపక్రమించారు.