by Suryaa Desk | Sat, Jan 04, 2025, 04:46 PM
తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చిన ఘనత కేసీఆర్‌దే అని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు డ్రా పద్ధతిన ఇంటి నెంబర్లను ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి కేటాయించారు.ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ పారదర్శకంగా జరిగింది. నిజమైన అర్హతగల పేదలకే ఇండ్లు కేటాయింపు జరిగింది. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల కోడ్, ఇతర పనుల జాప్యం వల్ల నెంబర్లు కేటాయింపు ఆలస్యమైంది. సూర్యాపేట నియోజకవర్గంలో ఎటువంటి అవకతవకలకు అవకాశమివ్వను. ప్రశాంతతకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షేంచేది లేదు. డబుల్ బెడ్రూం ఇండ్ల నెంబర్లు తీసుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. త్వరలోనే పండుగ వాతావరణంలో గృహ ప్రవేశాలు చేసుకుందామని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలిపారు.