by Suryaa Desk | Mon, Jan 06, 2025, 11:38 AM
హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే మెట్రో సర్వీసులు, కొత్త ఫ్లైఓవర్స్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ సమస్య చాలా వరకు మెరుగుపడింది.నగరంలో మరో కొత్త ఫ్లైఓవర్ జనవరి 6వ తేది సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. ఆరాంఘర్ నుంచి జూ పార్క్ వరకు నిర్మించిన ఈ ఆరు లైన్ల ఫ్లైఓవర్ ప్రారంభమైతే బెంగుళూరు నుంచి సిటీలోకి వచ్చే వారికి ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు ఉండవు. ఈకార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ, మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా పాల్గొంటారు.భాగ్యనగరంలో మరో ఫ్లైఓవర్ ఈరోజు నుంచి అందుబాటులోకి రానుంది. అరాంఘర్ నుంచి జూ పార్క్ వరకు సుమారు 4.8 కిలోమీటర్ల పొడవులో 6 లైన్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభిస్తారు. ఈఫ్లైఓవర్ ప్రారంభమైతే ఆరాంఘర్ నుంచి బహదూర్‌పూరా మధ్యలో ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరనుంది.
ఈనూతన ఫ్లైఓవర్‌ను జనవరి 3వ తేదిన ప్రారంభించాల్సి ఉండగా.. కొన్ని కారణాలు, వాతావరణ అనుకూల పరిస్థితుల దృష్ట్యా వాయిదా పడింది. జనవరి 6న మధ్యాహ్నం దీన్ని ప్రారంభిస్తున్నట్లుగా జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్‌గా ఇది అందుబాటులోకి రానుంది. దీని ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ,ఏంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా పాల్గొంటారు.ఈ కొత్త 6 లైన్ల ఫ్లైఓవర్ ను 4.8 కిలోమీటర్ల పొడువున నిర్మించారు. ఆరాంఘర్ చౌరస్తా నుంచి జూపార్క్ వరకు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్య పెద్ద తలనొప్పిగా ఉండేది.ఈకపై ఆ సమస్య ఉండదు.హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్స్‌లో ఇదే రెండో పెద్ద ఫ్లైఓవర్‌గా చెబుతున్నారు.హైదరాబాద్‌లోని చాలా రద్దీ ప్రాంతాలు, ముఖ్యమైన ప్రాంతాలైన ఆరాంఘర్, శాస్త్రీపూర్,కాలాపత్తర్, దరుల్ ఉలూమ్,శివరాంపల్లి, హసన్‌నగర్ వంటి ఓల్డ్ సిటీకి అనుసంధానమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య క్లియర్ కానుంది.సుమారు రూ.799కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించింది ప్రభుత్వం.కొత్త ఫ్రైఓవర్ అందుబాటులోకి రానుండటంతో నగరవాసులతో పాటు ఓల్డ్ సిటీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బెంగుళూరు నుంచి వచ్చే కార్లు, ఇతర వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా నేరుగా తక్కువ టైంలో సిటీ దాటవచ్చని భావిస్తున్నారు.