by Suryaa Desk | Tue, Jan 07, 2025, 04:33 PM
తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ కమిటీ ఎన్నికలు సిద్దిపేటలో 4.5 తేదీలలో. జరిగినాయి . ఈ మా మహాసభలలో ఖమ్మం కు చెందిన ఎం. ప్రసాద్ ను రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది . ప్రసాద్ విద్యుత్ శాఖ లో వివిధ పదవులు చేసి ఇప్పుడు రాష్ట్రస్థాయి పదవికి ఎంపికయ్యారు . గతంలో ఖమ్మం డివిజన్ కార్యదర్శిగా , జిల్లా ఉపాధ్యక్షుడిగా , కంపెనీ కార్యదర్శిగా మూడు దఫాలుగా పనిచేసి ప్రస్తుతం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు.
గత 25 సంవత్సరాల నుండి కార్మిక , ఉద్యోగుల సమస్యల కోసం హక్కుల కోసం అహర్నిశము పనిచేస్తూ అనేక ఉద్యమాలు నిర్మిస్తూ ఖమ్మం జిల్లాలో యూనియన్ బలోపేతానికి తన వంతుగా కృషి చేసి , కంపెనీ స్థాయి 16 జిల్లాల ప్రధాన కార్యదర్శిగా ఎంపికై మూడు దఫాలుగా పనిచేసి , ప్రస్తుతము రాష్ట్రస్థాయి పదవికి ఎంపిక అయినారు .