by Suryaa Desk | Wed, Jan 08, 2025, 02:58 PM
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ విచారణకు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. ఏసీబీ విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 6న కేటీఆర్‌ను ఏసీబీ విచారించాల్సింది. కానీ.. తన న్యాయవాదిని అనుమతించనందున హాజరుకాలేనంటూ.. ఆయన ఏసీబీ కార్యాలయానికి వచ్చి మరీ తిరిగి వెళ్లడంతో విచారణ జరగలేదు. దాంతో ఏసీబీ అధికారులు అదేరోజు ఆయనకు మరోమారు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9న (గురువారం) విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.