by Suryaa Desk | Wed, Jan 08, 2025, 03:00 PM
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో రూ.2,600 కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. కొత్త రహదారుల నిర్మాణ అంచనాలు పక్కాగా ఉండాలని, ఇష్టారీతిన అంచనాలను సవరించొద్దని స్పష్టం చేశారు.
పనులు సరిగా చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని, నాసిరకం పనులకు ఎన్ఏసిలిచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహానగరాల్లో రోడ్లు మెరిసినట్టుగానే పల్లెల్లోనూ రహదారులు మెరవాలన్నారు.