by Suryaa Desk | Thu, Jan 09, 2025, 03:49 PM
రోడ్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి అయిన సరే వెయ్యి కోట్లైనా మంజూరు చేయిస్తానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని ముడిమ్యాల స్టేజ్ నుండి రావులపల్లి మీదుగా మేడిపల్లి వరకు రూ.24 కోట్లతో నిర్మించ తలపెట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ముడిమ్యాల గేట్ వద్ద మంత్రి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ వీప్ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ పామేన భీం భరత్, స్థానిక కాంగ్రెస్ సీనియర్ లతో కలిసి శంకుస్థాపన బుధవారం శంకుస్థాపన చేశారు. అంతకుముందు మండల కేంద్రంలో చేవెళ్ల పీఎసీఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి సమతా దంపతులు తమ సొంత నిధులు 30 లక్షలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవనాన్ని, నాబార్డ్ వారి నిధులు 38 లక్షల అంచనా విలువతో ఏర్పాటు చేసిన 500 మెట్రిక్ టన్నుల గోదాంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో భాగంగా ముడిమ్యాల పీఎసీఎస్ చైర్మన్ గోనే ప్రతాప్ రెడ్డి సరితా నేతృత్వంలో ముడిమ్యాల గేట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
ఆస్తులు పోతే సంపాదించుకోవచ్చు, భూములు పోతే కొనుక్కోవచ్చు కానీ మనిషి ప్రాణం పోతే మాత్రం ఆ భగవంతుడు కూడా తిరిగి తీసుకురాలేడని అన్నారు. అందుకనే అందరూ రోడ్లు వేయాలని వెంటపడుతున్నారని అన్నారు. ఈమధ్యనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడనని, ఆయన పార్టీలను దృష్టిలో పెట్టుకొరని, తొందరలోనే అప్పా - మన్నెగూడ రోడ్డు నిర్మాణ పనులు స్టార్ అవుతాయని తెలిపారు. తాను మంత్రి అయిన తర్వాత ఉప్పల్ నుండి ఘట్కేసర్ రోడ్డు ఆరున్నర కిలోమీటర్ల ఫ్లై ఓవర్ ఏడు కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. వెంటపడకపోతే ఆ అభివృద్ధి జరిగేది కాదన్నారు. రోడ్డనేవి ప్రభుత్వ అభివృద్ధికి సూచికలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టే ప్రజలతో సెల్ఫీల నుంచి అసెంబ్లీలో మాట్లాడేంత వరకు ప్రతిక్షణం ప్రజల్లోనే ఉంటున్నామని పేర్కొన్నారు. తాను ఏదైనా వాస్తవాలే మాట్లాడుతాను కాబట్టే ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తాను ఏది అడిగిన మంజూరు చేసేవాడని, ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తాను ఏది అడిగిన మంజూరు చేస్తాడని చెప్పారు. ఏ సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సొంత నిధులతో 30 లక్షలతో పీఎసీఎస్ నూతన భవనాన్ని నిర్మించిన దేవల సమతా వెంకట్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. చేవెళ్ల మాజీ సర్పంచ్ శైలజా ఆగిరెడ్డి తనకు వ్యక్తిగతంగా దగ్గరివారని చెప్పుకొచ్చారు. చేవెళ్ల గ్రామ పంచాయతీ అభివృద్ధికి కోసం చేసిన నిధుల పెండింగ్ లను తొందరలోనే మంజూరు చేయిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోనే రావులపల్లి మాజీ సర్పంచ్ కేసారం శ్రీనివాస్ తన 100 మంది అనుచరులు, గ్రామస్తులతో ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, అర్బన్ డెవలప్ మెంట్ చైర్మన్ చల్లా నరసింహ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరీ సతీష్, సీనియర్ నాయకులు పడాల వెంకట స్వామి, సున్నపు వసంతం, షాబాద్ దర్శన్, జనార్దన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు బండారి ఆగిరెడ్డి, చేవెళ్ల, సర్ధార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లు పెంటయ్య గౌడ్, సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పడాల ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ గుండాల రాములు, తదితరులు పాల్గొన్నారు.