by Suryaa Desk | Thu, Jan 09, 2025, 02:54 PM
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 118/2022. యూ /ఎస్ 376,506 ఐపీసీ & 5 r/w 6 అఫ్ పోక్సో యాక్ట్ క్రింద నమోదు అయినా కేసులో నిందితుడు దాసరి గోవింద్ తండ్రి రాములుకి జీవిత ఖైదు పడే విధంగా పని చేసిన 1) ఏడిల్ పీపీ : శ్రీమతి మెరాజ్ ఫిర్దౌస్, 2) ప్రస్తుత దౌల్తాబాద్ ఎస్ ఎహ్ ఓ : ఏ . రవి గౌడ్, 3)భరోసా ఇంచార్జ్ ఎం.శైలజా, 4) సీ డి ఓ : B.సురేష్ గౌడ్, 5) I ఏ డి జె కోర్ట్ లైజన్ ఆఫీసర్: ఎస్ .నిరంజన్ గౌడ్,6) బాధితురాలి బ్రీఫింగ్ అధికారి ఏ. కీర్తి గార్లను జిల్లా ఎస్పీ బుధవారం సన్మానించడం జరిగింది.
ఇట్టి సంధార్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్క అధికారి కలసి పని చేయడం వలనే నేరస్తునికి శిక్ష పడటం జరిగింది. ఈ కేసులో పని చేసిన ప్రతి ఒక్క అధికారికి పెరుపేరున అభినందనలు. ఇక ముందు కూడా అధికారులు ఇదే విధంగా సమన్వయం తో కలసి పని చేయాలని, జిల్లాలో మహిళలు, బాలికల జోలికి వెళితే వధిలిపెట్టే ప్రసక్తే లేదని, అట్టి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.