by Suryaa Desk | Thu, Jan 09, 2025, 03:46 PM
సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు స్వీపర్స్ అండ్ స్కావెంజర్స్ సమస్యల పైన పెండింగ్ జీతాల పైన ధర్నా నిర్వహించి కలెక్టర్ ఏవో కి మెమోరండం ఇవ్వడం జరిగింది గత ఐదు మాసాల నుండి జీతాలు రాక అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మదర్శ కమిటీ నియమించుకోవడం జరిగింది కానీ ఇప్పటివరకు స్వీపర్సు ఆయన స్కావెంజర్స్ కు జీతాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాయి ప్రభుత్వం వెంటనే జీతాలు చెల్లించాలని అమ్మ ఆదర్శ కమిటీలను కాకుండా నేరుగా కార్మికుల ఖాతాలోనే జమ చేయాలని ఈ ధర్నాను ఉద్దేశించి జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ స్వీపర్స్ అండ్ స్కావెంజర్స్ కు కనీస వేతనాలు అమలు చేయాలని నెలకు పదిహేను వేల రూపాయలు తగ్గకుండా ఇవ్వాలని మన ప్రభుత్వాన్ని కోరారు విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా అందరికీ ఒకే రకమైన వేతనాలు చెల్లించాలని శ్రమ దోపిడికి గురవుతూనే ఉన్నాము నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని నిత్యవసర సరుకుల ధరలను పెంచి కార్మికులపై మోయలేని భారాన్ని మోపినాయి సరళ కరువుణంగా కార్మికుల యొక్క జీతభత్యాలు పెంచాలని పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం.
కల్పించాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చీపుర్లు బ్లీచింగ్ పౌడర్ ఫినాయిల్ బ్లౌజులు మాస్కులు ప్రభుత్వమే సప్లై చేయాలని సంవత్సరానికి రెండు జాతుల యూనిఫాం ఇవ్వాలని అక్రమ తొలగింపులు ఆపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మోడీ అధికారంలోకి వచ్చి అనేక దఫాలుగా ఇత్యవసర సరుకులు ధరలను పెంచి సామాన్య ప్రజలు కుటుంబాన్ని పోషించుకోవడం భారంగా మారినాయి కార్మికులందరికీ ప్రతి నెల 5వ తారీఖున జీతాలు చెల్లించాలని అందరికీ మండల ఎంఈఓ ల ద్వారా ఐడెంటి కార్డులు ఇవ్వాలని సంవత్సరానికి 12 సబ్బులు ఇవ్వాలని 60 సంవత్సరాలు నిండిన కార్మికులందరికీ 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఒక పక్క ప్రభుత్వాలు కనీస వేతనాలు అమలు చేయాలని కార్మిక చట్టాలు చెబుతున్నప్పటికీ ఆచరణలో అమలు చేసే పరిస్థితి లేదు ఒక సమస్యను సానుకూలంగా పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని సమ్మె కైనా వెళ్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో శంకరయ్య తేజస్విని శారద శ్యామల దండు లక్ష్మి జిల్లా కో కన్వీనర్ బొడ్డు నరసవ్వ రజిత శ్యామల లక్ష్మి నరసింహ వీరభద్ర రేణుక వనజ శంకర్ కొమురయ్య నరసయ్య మంజుల లలిత లావణ్య తదితరులు పాల్గొన్నారు.