by Suryaa Desk | Thu, Jan 09, 2025, 02:24 PM
విద్యాశాఖ సెక్రెటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి యోగితా రాణా నియమితులయ్యారు. 2003 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రాణా ప్రస్తుతం సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా భాద్యతలు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ సెక్రెటరీగా ఉన్న బుర్రా వెంకటేశంను రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌లో టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియ మించింది. గురువారం యోగితా రాణాను సెక్రెటరీగా నియమించడం తో శ్రీధర్‌ను ఆ బాధ్యతల నుంచి విద్యాశాఖ రిలీవ్ చేసింది.