by Suryaa Desk | Thu, Jan 09, 2025, 02:02 PM
ఆజాద్ డిఫెన్స్ అకాడమీ 2025 నూతన క్యాలెండర్ ను బుధవారం రాయపోల్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై రఘుపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ యువత మద్యం, డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసై వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. దేశ సేవకు యువత నడుంబించాలని పోలీస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ వంటి రంగాలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వాటిలో ఉద్యోగం సాధించి దేశానికి సేవ చేయాలని సూచించారు.
డిఫెన్స్, ఆర్మీ రంగాలలో ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది జాయిన్ అయ్యేటట్లు కృషి చేసి సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆజాద్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ నీల చంద్రం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.