by Suryaa Desk | Thu, Jan 09, 2025, 03:10 PM
వికారాబాద్ జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు, సైబర్ క్రైమ్ డీస్పీ ఆధ్వర్యంలో బుధవారం సైబర్ జాగృక్త అవేర్నెస్ దివస్ సందర్భాన, వికారాబాద్ జిల్లా అంతటా (19) పోలీస్ స్టేషన్ల పరిధిల ల్లో సైబర్ నేరాలపైన ముఖ్యంగా ఈ మధ్యన డిజిటల్ అరెస్ట్ అనే మోసపూరితమైన బెదిరింపు తో అమాయక ప్రజలకు, ట్రై (టెలికాం) డిపార్ట్మెంట్, సిబిఐ , కస్టమ్స్, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ల అధికారులమనే పేరుతో ఫోన్లు, వాట్సాప్, టెలిగ్రామ్ కాల్స్ చేసి, అమాయక ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తూ, లక్షల్లో కోట్లల్లో డబ్బుల్ని కాజేస్తున్న నేరగాళ్ల గురించి, నేరాల గురించి, ప్రజలందరిలో అవగాహన కల్పించనైనది.
ఇట్టి సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ, ఇలాంటి సైబర్ నేరగాళ్ల కుతంత్రాలకు జంకొద్దని, నమ్మొద్దని, సైబర్ నేరల పైన అవగాహన పెంచుకోవాలని, ఒకవేళ మోసం జరిగిందని భావిస్తే, వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లిన్ 1930 నంబర్ కు గానీ, www.cybercrime.gov.in ద్వారా పూర్తి వివరాలతో పిర్యాదు చేయాలని ప్రజలందరినీ కోరడమైంది. ఈ అవగాహన కార్యక్రమలలో జిల్లాలోని విద్యార్థులు, మహిళలు, యువతీ యువకులు, వ్యాపార వర్గాలు, గ్రామీణ రైతాంగం, సామాన్య ప్రజానీకం పాల్గొనడమైనది.