by Suryaa Desk | Thu, Jan 09, 2025, 11:58 AM
భద్రాచల దేవస్థాన ముక్కోటి ఏకాదశి ప్రత్యేక ఆహ్వాన పత్రికను సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ప్రసిద్ధి చెందిన బాలాజీ దేవాలయం కమిటీ వారికి శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గురువారం అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేవాలయం సేవలు అమోఘమని కొనియాడారు. మా సేవలను గుర్తించి భద్రాచల ఆహ్వానం అందడం అదృష్టం అని దేవాలయం కమిటీ వారు ఆనందం వ్యక్తం చేశారు.