by Suryaa Desk | Thu, Jan 09, 2025, 03:01 PM
ఆత్మకూర్ మండల కేంద్రంలో జాతీయ రహదారి భద్రతా మాసము కార్యక్రమాలలో భాగంగా ఆత్మకూరు నుండి గూడెపహాడ్ NSR హోటల్ వరకు బైక్ ర్యాలీ ఆత్మకూరు సిఐ సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి ఈస్ట్ జోన డీసీప పరకాల ఆర్డిఓ ఆత్మకూర్త తాసిల్దార్ దాదాపు 200 మంది ప్రజలు హాజరైనారు. ఈ కార్యక్రమంలో భాగంగా 5 హెల్మెట్లు కూడా వాహన దారులకు ఇవ్వటం జరిగినది. ప్రతి ఒక్కరూ వీటన్నిటిని పాటించాలని వాగ్దానం చేయమని అభ్యర్థిస్తున్నాము.
1. నేను స్పీడ్ లిమిట్స్ లో డ్రైవ్ చేస్తాను
2. నేను ఎప్పుడూ తాగి డ్రైవ్ చేయను
3. నేను ఎప్పుడూ దృష్టి మరల్చి డ్రైవ్ చేయను
4. నేను ఎప్పుడూ అలసటతో డ్రైవ్ చేయను
5. నేను ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తాను
6. నేనెప్పుడూ ప్రమాదకరమైన డ్రైవింగ్ చేయను
7. నేను డిఫెన్సివ్ డ్రైవింగ్ ని అనుసరిస్తాను
8. నేను ఎల్లప్పుడూ హెల్మెట్ ధరిస్తాను
9. నేను ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ ధరిస్తాను.
కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ 9 సూత్రాలకు పాటించి మీ ప్రియమైనవారు అనుసరించడానికి ప్రచారం చేయమని అభ్యర్థిస్తున్నాము. అని ఆత్మకూరు సిఐ తెలిపారు