by Suryaa Desk | Thu, Jan 09, 2025, 02:52 PM
యాదగిరిగుట్టలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి విశిష్ట పర్వంతో పాటు, వార్షిక అధ్యయనోత్సవాలను శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నిర్వహించనుంది. ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజు నుంచే ఆలయ వార్షిక అధ్యయనోత్సవాలు మొదలవుతాయి. ఆరు రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో అలంకార సంబరాలు, ప్రబంద పఠనం చేపడతారు.