by Suryaa Desk | Thu, Jan 09, 2025, 02:12 PM
జిల్లా పరిధిలో ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు IPS గారు హెచ్చరించారు. జిల్లా పరిధిలో చైనా మాంజా విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చైనా మంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందన్నారు.చైనా మాంజా తో తలెత్తే అనర్థాల పై అందరికి అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
నైలాన్, సింథటిక్ దారాలు పక్షులకు, పర్యావరణానికి, మనుషులకు హాని చేస్తాయని అన్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందని అన్నారు.ఈ యొక్క చైనా మాంజా ను అమ్మినా, రవాణా చేసినా సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ లకు గాని డయల్ 100 గాని ఫోన్ చేసి తెలపాలని సూచించారు.