by Suryaa Desk | Thu, Jan 09, 2025, 02:35 PM
భీమారం మండలం పసునూరు గ్రామానికి చెందిన బాదావత్ రాజు వయస్సు 29 సంవత్సరాలు అను వ్యక్తి తన స్నేహితులను కలవడానికి రాత్రి సమయంలో తన మోటారు సైకిల్ పై వెళ్తుండగా, కొండాపూర్ గ్రామ శివారులోని వైష్ణవి సూపర్ మార్కెట్ సమీపంలో సారంగాపూర్ మండలం అర్పేల్లి గ్రామానికి చెందిన ఉస్కెల రాయలింగు తన టిప్పర్ వాహనాన్ని ఎలాంటి ట్రాఫిక్ నియమాలు పాటించకుండా ఇండికేటర్ లైట్లు వేయకుండా.
రోడ్డుకి అడ్డంగా వాహనాన్ని నిలపాడు ఆ వాహనాన్ని గమనించకుండా ఢీకొనడంతో తీవ్ర రక్త గాయాలై పడి ఉన్న బాదావత్ రాజును గ్రామస్తులు గమనించి అంబులెన్స్ కు కాల్ చేయగా ఆంబులెన్స్ లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడని మృతుడి భార్య నాగలక్ష్మి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్సై శ్యామ్ రాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.