by Suryaa Desk | Thu, Jan 09, 2025, 01:33 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తక్షణ విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
ఈనెల 15న విచారిస్తామని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. ఫార్ములా ఈ-కారు రేస్ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు..కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్‌ను దాఖలు చేశారు.