by Suryaa Desk | Thu, Jan 09, 2025, 02:14 PM
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమునకు గురువారం ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఆలయ కమిటీ చైర్మన్ గా వేముల నరసింహారావు, ఆరు మంది పాలకమండలి సభ్యులకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు రూ. 25 లక్షల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.