by Suryaa Desk | Thu, Jan 09, 2025, 02:13 PM
భువనగిరిలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో భారతదేశ మొట్ట మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు మరియు సావిత్రి బాయి పూలే సహచరురాలు ఫాతిమా షేఖ్ జయంతి సందర్బంగా గురువారం భువనగిరి పట్టణంలోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద వారి చిత్ర పటానికి పూలతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మైనారిటీ గురుకులాలలో అధికారికంగా జయంతిని జరిపే విధంగా ఆదేశాలు జారీచేసిన ముఖ్యమంత్రికి భువనగిరి ముస్లిం జేఏసీ తరపున ధన్యవాదాలు తెలిపారు.